రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విషాదంచోటు చేసుకుంది. దేవుడికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు రోహిత్ అనే యువకుడు. మతి, తెలివి ఉండే నా తల రాత ఇలా రాశావా? నీ కొడుకు తల రాత మాలాగా ఎందుకు రాయలేదు? మేం మీ కొడుకులం కాదా? అంటూ దేవుడికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు రోహిత్.

మంచి ఆత్మహత్య లేఖ రాయలన్న కోరిక నాకు నెరవేరింది… కోరిక అయితే నెరవేరింది కానీ నా కలలు నెరవేరలేదని పేర్కొన్నారు. నా జీవితం ఆ జగన్మాతకు అంకితం… నా దేహాన్ని కాశీలో దహనం చేయండి అంటూ సూసైడ్ నోట్ లో మృతుడు రోహిత్ వెల్లడించాడు.