ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఇంటిపై కొంతమంది దుండగులు దాడి చేశారు. నెల్లూరు పరిధి కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై అర్ధరాత్రి… దౌర్జన్యం చేసి మరీ దుండగులు దాడి చేశారు. ఇంట్లో ఉన్న కారు కూడా…. పల్టీలు కొట్టేలా చేశారు. అయితే… ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై.. రెండు రోజుల కిందట ప్రసన్న కుమార్ రెడ్డి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంతి రెడ్డి తో పాటు ఆమె భర్త వేమిరెడ్డి ని ఉద్దేశించి కూడా ఫైర్ అయ్యారు. అయితే ఆ వ్యాఖ్యలు నేపథ్యంలో టిడిపి నేతలు ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరగగానే… మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా… ప్రసన్నకుమార్ ఇంటికి వెళ్లి ఓదార్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ అలాగే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఇంత దారుణంగా ఇద్దరు వ్యవహరించాలని… దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే, @YSRCParty సీనియర్ నేత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై @JaiTDP నేతల దాడి#TDP ఎంపీ వేమిరెడ్డి అనుచరులు దాడి చేసినట్లుగా గుర్తింపు #AndhraPradesh#YSRCP https://t.co/qZPOEgWz4s pic.twitter.com/zXxnbsmMyM
— Telugu Feed (@Telugufeedsite) July 7, 2025