Hyd: నడిరోడ్డుపై బీర్ తాగుతూ రచ్చ చేసిన యువతీ, యువకుడు అరెస్ట్ !

-

ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలో యువతీ, యువకుడు హల్‌చల్ చేశారు. నిన్న ఉదయం 6 గంటల సమయంలో బీర్లు తాగుతూ హల్‌చల్ చేయడంతో వాకింగ్‌కి వచ్చే వాళ్లు ఆ జంటను నిలదీశారు. దీంతో వాకింగ్ వెళ్తున్న వారితో యువతి, యువకుడు వాగ్వాదానికి దిగారు. చేతిలో బీరు బాటిల్ పట్టుకొని కారులో పాటలు పెట్టి, నానా హంగామా సృష్టించారు. అయితే… నాగోల్ లో ఉదయం తాగి రోడ్డుమీద హంగామా చేసిన జంట అరెస్టు అయింది.

నడిరోడ్డు పై తాగుతూ వాకర్స్ ను ఇబ్బంది గురిచేసిన అలెక్స్ తో పాటు యువతి అరెస్టు అరెస్ట్‌ అయింది. తాగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్న జంటను అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులు..తాగి గొడవ చేస్తున్న వాళ్లని మందడించే ప్రయత్నం చేశారు. వాకర్స్ మీద తిరుగుబడి హంగామా సృష్టించి బీభత్సం సృష్టించింది జంట. ఇక ఈ సంఘటనలో అలెక్స్ తో పాటు యువతీని అరెస్టు చేసిన నాగోల్ పోలీసులు…స్టేషన్‌ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news