హరీష్ రావు వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్ కౌంటర్..!

-

హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారు. హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా.. హరీష్ ప్రయత్నాలు కేసీఆర్ కి తెలిసి దూరం పెట్టలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కొప్పడడం వల్ల హరీష్ రావు వార్తలు సైతం మీడియాలో రాలేదు. హరీష్ రావుకు అన్ని తెలిసినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని అన్నారు.

ఇక పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత హరీష్ రావుకు ఎక్కడిది. హరీష్ రావు మార్ఫింగ్ సినిమా చూపిస్తున్నాడు. బీఆర్ఎస్ సినిమా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోంది. రైతుల వడ్డీలు కూడా బీఆర్ఎస్ కట్టలేకపోయింది. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు చూసి హరీష్ కండ్లలో నిప్పులు పోసుకుని మాట్లాడుతున్నారు. పడేండ్లలో రైతులకు 80 వేల కోట్లు వేశామని హరీష్ అబద్ధాలు చెబుతున్నారు. మేం పది మాసాలలో 22 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశాం. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉంది. వాగులు, వంకలు, కొండలు, కొనలకు గత ప్రభుత్వం రైతుబందు వేసింది. కానీ మేము కౌలు రైతులకు సైతం బోనస్ ఇచ్చాం. అబద్దాలు మాట్లాడే హరీష్ రావు ఇప్పటి నుండైనా నిజాలు మాట్లాడాలని కోరుతున్నాను అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version