రైతులను ఈ ప్రభుత్వం వెంటిలేటర్ల మీదకు నెట్టేసింది : అనిల్ కుమార్

-

రైతుల గురించి ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు ధాన్యం రాశుల వద్ద గగ్గోలు పెడుతున్నారు అని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. బుడమేరుకు వరదలు వస్తాయని తెలిసినా విజయవాడని ముంచేసినట్టుగానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. తుపాను వస్తుందని తెలిసినా రైతులను అప్రమత్తం చేయలేదు. రైతుసేవా కేంద్రాల వద్దకు వెళ్తే మిల్లర్ల దగ్గరకు వెళ్లమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. విజయవాడ నుండి మచిలీపట్నం వరకు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ధాన్యం రాసులే కన్పిస్తున్నాయి. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టటం లేదు.

రైతులను ఈ ప్రభుత్వం వెంటిలేటర్ల మీదకు నెట్టేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి మాటలు కోటలు దాటుతున్నాయేగానీ చేతల్లో ఏమీ కనపడడం లేదు . కనీసం టార్బలిన్ పట్టాలు, గోనె సంచులు కూడా ఇవ్వటం లేదు. మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రంలో ఒక్క బస్తా ఐనా మద్దతు ధరతో రైతుల నుండి కొనుగోలు చేశారా అని ప్రశ్నించిన అనిల్ కుమార్.. మాతో వస్తే రైతుల గోడు మంత్రులకు చూపిస్తాం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version