శోభిత ఆత్మహత్య పై మామ కీలక కామెంట్స్..!

-

కన్నడ నటి శోభిత ఆత్మహత్యపై ఆమె భర్త బర్త సుధీర్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి స్పందించారు. మేము మా కుటుంబ సభ్యురాలు ఆమెను కోల్పోయాం. కుటుంబానికి డామేజ్ అయింది. మేమంతా డిప్రెషన్ లో ఉన్నాం. మా బాబు సుధీర్ రెడ్డి షాక్ లో ఉన్నాడు. స్వల్ప కాలంలో మా ఇంట్లో సొంత కూతురులా మెలిగింది. మంచి విషయాల్లో సంస్కారవంతురాలు. అమ్మాయి ఎక్కువగా భగవంతుని ధ్యానం లో ఉండేది.

మాట్రీమోని ద్వారా ఇరు కుటుంబాలు కలిసి వివాహం చేసాము. సినిమాల్లో సీరియల్లో నటించకూడదని మేము ఎప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. శోభితాను మా కొడుకు సుదీర్ అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేశాడు. శోభిత కుటుంబం అన్ని విధాల మాకు సహకరించి ఉంది. తెలంగాణ సాంప్రదాయాల్లో అంత్యక్రియలు చేస్తామని అడిగాం. కానీ వారు బెంగళూరులో అంత్యక్రియలు చేస్తాము ఆమె చివరి కోరిక అని చెప్పారు. అంత్యక్రియల కోసం మమ్మల్ని బెంగళూరు రమ్మని చెప్పారు అని శోభిత మామ బుచ్చిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version