వరదల వల్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కేటీఆర్ విదేశాలలో ఏం చేస్తుండు : ఆది శ్రీనివాస్

-

విపత్తులో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రాంతల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు అని వేములవాడ MLA ఆది శ్రీనివాస్ అన్నారు. అలాగే గతంలో భద్రాచలంలో వరదలు వస్తే కేసీఆర్ క్లౌడ్ బరెస్టు అన్నాడు. విదేశీ కుట్ర వలనే క్లౌడ్ బరెస్టు అయిందని కేసీఆర్ రాజకీయం చేశాడు. కానీ వరద ప్రాంతాల్లో పర్యటించలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు.

వరద జరిగిన ప్రాంతాల్లో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వరద నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రానికి నివేదిక పంపాము. సక్కగా పని చేస్తున్న ముఖ్య మంత్రికి కితాబు ఇవ్వాల్సింది పోయి..పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ విదేశాలలో ఏమి చేస్తుండు. రైతుల ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూసిండ్రు. ఇప్పుడు విపత్తును అడ్డం పెట్టుకొని బురద రాజకీయం చేయాలని చూస్తున్నారు అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news