BRSలో ఆ నలుగురే మిగులుతారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అటు కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ నాన్న… బాబు మెప్పుకోసం మీ పేరు పెట్టడా..? బాబు మెప్పు కోసం మీ నాన్న పరితపించలేదా? అంటూ చురకలు అంటించారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయట పెట్టలేదన్నారు. బీసీలు ఎక్కువ ఉన్నారని నివేదిక కూడా బయట పెట్టలేదని ఆగ్రహించారు.
బీసీ ల గురించి బీఆర్‌ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. Brs లో ఆ నలుగురే మిగులుతారు….ప్రతి పక్ష నాయకుడు అసెంబ్లీ కి రాడు.. బయట మాట్లాడతారని మండిపడ్డారు. మీలాగా మేము చెప్పిందే వినాలి అనే ధోరణి కాదు మాదని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ లాంటిదని… కాంగ్రెస్ పబ్లిక్ లిమిటెడ్ కంపనీ..ఇక్కడ ఎవడైనా షేర్ కొనొచ్చు..ఏ దైనా మాట్లాడొచ్చని తెలిపారు.