తెలంగాణలో రేవంత్ సర్కార్‌ కూలబోతుంది – బీజేపీ ఇంఛార్జి

-

Abhay Patil comments on revanth reddy govt: తెలంగాణలో రేవంత్ సర్కార్‌ కూలబోతుందని బాంబ్‌ పేల్చారు బీజేపీ ఇంఛార్జి అభయ్ పాటిల్. తెలంగాణ ప్రభుత్వంలోనూ గ్రూపులు ఉన్నాయని విన్నానని… తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కూడా ఎక్కువ రోజులు నిలబడదని తెలిపారు. వాళ్ల ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చుకుంటారు. మేము ఏమీ చేయబోమని తెలిపారు. కర్ణాటకను లూటీ చేసి రాష్ట్రాన్ని బికారి చేశారని ఆగ్రహించారు.

Abhay Patil comments on revanth reddy govt

తెలంగాణలోను అదే తరహాలో అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడే ట్రైలర్ మొదలైంది. కర్ణాటక తరహాలో సినిమా ముందు చూస్తారని హెచ్చరించారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ నడుస్తోందన్నారు. విజిటింగ్ కార్డ్ ల కోసం, పైరవీల కోసం పార్టీ పదవులు తీసుకునే వారికి నేనంటే భయమని.. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో బీజేపీ సభ్యత్వ నమోదు కొనసాగుతోందని తెలిపారు. నేతలకు, ప్రజాప్రతినిధులకు టార్గెట్ ఇచ్చి మెంబర్ షిప్ చేయిస్తున్నామని.. సభ్యత్వ నమోదులో పనితీరు ఆధారంగానే నేతలకు పదవులు ఉంటాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version