Telangana : కొత్త మెడికల్ కళాశాలల్లో జులై నుంచి తరగతులు ప్రారంభం

-

తెలంగాణలోని కొత్త వైద్య కళాశాలల్లో జులై నాటికి తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. కొత్త వైద్య కళాశాలల్లో పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

‘సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్యవిద్య విప్లవం దిశగా అడుగులు వేస్తోంది. వైద్యవిద్యకు హబ్‌గా మారుతోంది. మారుమూల జిల్లాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ, ఒక నర్సింగ్‌ కాలేజీ విధానం ప్రకటించి దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచింది.’ అని హరీశ్ రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version