రెండో రోజు ఏసీబీ విచారణకు హెచ్‌ఎండీఏ శివబాలకృష్ణ బినామీలు

-

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ వ్యవహారంలో రెండో రోజు అతని బినామీలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సత్యనారాయణ, భరత్‌ ఇద్దరు బాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని వరుసగా రెండో రోజు కూడా విచారిస్తున్నారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వారిని పలిపించి అధికారులు ప్రశ్నిస్తున్నారు. కస్టడీ విచారణ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శివబాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పలేదని ఏసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా ఈ కేసును విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు తన బినామీలను ప్రశ్నిస్తోంది. మరింత మందిని కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. బాలకృష్ణ ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా అని సమాచారం రాబడుతోంది. ఇందులో భాగంగా పలువురు అధికారులకు ఏసీబీ అధికారులు లేఖలు రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version