ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిధుల పై ఏసీబీకి ఫిర్యాదు..!

-

హైదారాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు వచ్చిన అభిమానుల కంటే దాని వల్ల వాచాహిన సమస్యలే ఎక్కువ ఉన్నాయి. అయితే తాజాగా మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల ఇష్యూ వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేటాయింపు లపై ఏసీబీకి ఫిర్యాదు చేసారు మున్సిపల్ శాఖ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసు నిదుల బదలాయింపుపై విచారణ జరపాలని ఏసీబీని కోరింది మున్సిపల్ శాఖ.

అయితే ఈ విషయంలో విచారణ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. కోట్లల్లో నిధులు బదిలీలు జరగడంపై విచారణ కోరింది మున్సిపల్ శాఖ. ఎటువంటి నిబంధనలు పాటించకుండా MAUD నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు 55 కోట్లు చెల్లించింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ సిసన్-10 రద్దు అయ్యింది. అయితే బోర్డు, ఆర్థికశాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండానే 55 కోట్లు ఓ విదేశీ సంస్థకు చెల్లించడం ఇప్పుడు దుమారం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news