మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లోకి దూసుకెళ్లింది ఓ కారు. మెదక్ జిల్లా శివంపేట (మం) ఉసిరికపల్లి గ్రామ శివారులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది కారు. అయితే.. స్వల్ప గాయాలతో కారులో ఉన్న వ్యక్తులు బయటపడ్డారు. గతేడాది అక్టోబర్ 16న ఇదే రోడ్డుపై కారు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
రోడ్డు వెడల్పు పనులు చేస్తుండటంతో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా సూచిక బోర్డులు అధికారులు..ఏర్పాటు చేయలేదు. దీంతో రోడ్డు ప్రమాదంలు… ఉసిరికపల్లి గ్రామ శివారులో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే.. తాజాగా అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది కారు.