సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ రేప్ కేసులో నిందితుడు అరెస్టు

-

హైదరాబాద్లో జులై 30వ తేదీన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్పై స్నేహితుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన స్నేహితులతో కలిసి ఓ హోటల్కు వెళ్లారు. మద్యం మత్తులో తన స్నేహితుడు మరో వ్యక్తితో కలిసి తనపై అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు శివాజీ రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు తాజాగా మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. తన స్నేహితురాలి ద్వారా బాధితురాలిని పరిచయం చేసుకున్న నిందితుడు.. ఆమెను డిన్నర్ కోసం ఇంటికి పిలిచాడు. నమ్మి వెళ్లిన యువతి కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి.. ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version