పోచారం ఇంట్లో పొలిటికల్ విందు.. సీఎం రేవంత్ సహా మంత్రులు హాజరు

-

కాంగ్రెస్‌లో ఇటీవలే చేరిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన నివాసంలో విందు సమావేశం నిర్వహించారు. ఈ రాజకీయ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి సహా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ విందులో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో .. 9 మంది మాత్రమే ఈ భేటీకి హాజరైనట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. గద్వాల్‌ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి హాజరు కాలేదని వెల్లడించాయి. అయితే ఈయన హస్తం నుంచి మళ్లీ బీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నట్లు ఇటీవల కేటీఆర్ను కలిసి చెప్పినట్లు తెలిసింది. ఆయన బీఆర్ఎస్కు తిరిగి వచ్చాడనే వార్తలు కూడా బాగా ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి గులాబీ పార్టీలోకి రానున్నారని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version