అదానీ-మోడీ ఒక్కటే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

అదానీ-మోడీ ఒక్కటే.. అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం దారుణం అన్నారు. మోడీ-అదానీ కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ మోడీ- అదానీ పై గళం విప్పారు. మోడీకి విజన్ లేదు.. త్యాగ గుణం లేదు.

Jaggareddy

రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు. త్యాగ శీలి. తనకు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ ని ప్రధానిని చేశాడని గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ దేశ పరువును తీశారని పేర్కొన్నారు. మోడీ ఎప్పుడు పేదల పక్ష పాతి కాదు.. ధనికుల పక్షపాతి అన్నారు. కాంగ్రెస్ పేద ప్రజల కోసం పోరాడుతుందని.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని పేర్కొన్నారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version