తవ్వినా కొద్దీ AEE నిఖేశ్ కుమార్ అక్రమాలు బయటకు వస్తున్నాయి. రూ.200 కోట్ల స్కాం వరకు స్కాం చేశాడట AEE నిఖేశ్ కుమార్. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసులో నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్‌ను తెలంగాణ ఏసీబీ అధికారులు రెండ్రోజుల కిందట అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ సోదాల తర్వాత ఆయన్ను అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ఏఈఈ నిఖేష్‌ను న్యాయమూర్తి నివాసంలో హాజరు పరిచగా..డిసెంబర్ 13వ తేదీ వరకు ఏసీబీ జడ్జి రిమాండ్ విధించారు.
ఇక ఇతను అక్రమాలు చేసి… రూ.200 కోట్ల వరకు సంపాదించాడట. గండిపేట చెరువు అక్రమ నిర్మాణాలలో నికేష్ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాడట AEE నిఖేశ్ కుమార్. గండిపేట ఇరిగేషన్ aee గా పనిచేశాడు నికేష్… ఉస్మాన్ సాగర్ (గండిపేట) చెరువును కాపాడాల్సిన AEE నిఖేశ్ కుమార్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చాడు. ఇలా మొత్తంగా అక్రమాలు చేసి… రూ.200 కోట్ల వరకు సంపాదించాడట.