హైదరాబాద్ లో కలకలం.. ఎయిర్ ఇండియా విమానం బాత్ రూమ్ లో బాంబు !

-

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు బెదిరింపులు వచ్చాయి. కొలకత్తా నుంచి హైదరాబాద్ వచ్చింది ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ విమానం. ఈ విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చి వేస్తామంటూ రాశారు అగంతకులు. విమానంలో బాంబు బెదిరింపు వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపారు పైలట్.

Air India flight receives bomb threat
Air India flight receives bomb threat

అనంతరం ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ విమానం హైదరాబాద్ కు చేరుకుంది. నాలుగు గంటలపాటు తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు అధికారులు. ఇక అటు పాకిస్తాన్ కు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోం.. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్‌ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు.

ప్రతిసారి యుద్ధంలో పాకిస్తాన్‌ దుమ్ముదులిపేశాం… న్యూ ఏజ్‌ వార్‌ ఫేర్‌లో కూడా మన శక్తిని చూపించామన్నారు. 21వ శతాబ్దం యుద్ధ రీతిలో మేకిన్ ఇండియా ఆయుధాలు వినియోగించాం.. ఇది యుద్ధాల యుగం కాదు.. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news