అసెంబ్లీలో అప్పుల గురించి చర్చ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సందర్భంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వానికి అసెంబ్లీ నడపడానికి రావడం లేదు అంటే.. ఇక వాళ్లు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారో అర్థం చేసుకోగలం, ఊహించగలం అని సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఒవైసీ.
అసెంబ్లీలో ఏ అంశం పై చర్చ చేపడుతున్నారని సమాచారం ఇవ్వాలి. సభను నడిపే విధానం ఇది కాదు.. ప్రాధాన్యత అంశాలను ప్రభుత్వం చర్చకు తీసుకుంటుంది. ఆర్థిక చర్చ అంశం పై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభ ఎన్ని రోజులు నడుపుతారో ఇంకా తెలియదు. పార్లమెంట్ లో సైతం సభలో చర్చించాల్సిన అంశాల గురించి ముందే చెబుతారు. మీరు ఏ అంశం పై చేపడుతున్నారో తెలియదని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ముందు ముందు సభలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి అని ఆయన సూచించారు.