హరీశ్ రావు క్షమాపణ చెప్పాలి : రాజ్ గోపాల్ రెడ్డి

-

అబద్దమే చెప్పు.. ఈ కాంగ్రెస్ తీరు అబద్ధాలు పదే పదే చెప్పు అన్నట్టుగా ఉంది అని మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడారు. మాట్లాడుతుండగానే మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి దొంగ అని పేర్కొన్నారు. ఈ  సందర్భంలో గందరగోళం చోటు చేసుకుంది.  వెంటనే హరీశ్ రావు యూస్ లెస్ ఫెల్లో ఎవడు వాడు నన్ను దొంగ అనేది అని సీరియస్ అయ్యారు.  నన్ను దొంగ అంటే యూస్ లెస్ ఫెల్లో అంటానని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంలో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే స్పీకర్ ఈ వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించారు.

ఆ తరువాత రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు. హరీశ్ రావు నన్ను పట్టుకొని యూస్ లెస్ ఫెల్లో అన్నాడు. హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని.. ఇది చాలా అన్యాయం అని డిమాండ్ చేశారు రాజ్ గోపాల్ రెడ్డి. హరీశ్ రావు క్షమాపణ చెప్పకుంటే సభను కూడా నడవనీయనని పేర్కొన్నారు. మరోవైపు హరీశ్ రావురాజగోపాల్ రెడ్డి గారు మీరు హోం మంత్రి అయ్యాక మీకు నీకు మైక్ ఇస్తారు కూర్చో అని సెటైర్లు వేయడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news