తెలంగాణ పోలీస్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు

-

తెలంగాణ పోలీస్‌ అభ్యర్థులకు అలర్ట్‌. పోలీస్‌ నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు మార్పులు చేసింది పోలీసు నియామక మండలి. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది పోలీసు నియామక మండలి. ఎస్సై(ఐటీ), ఏఎస్సై( ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల్లో తేదీలు మార్పులు చేసింది.

ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీకి మార్పు చేసింది. ఎస్సై(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చోటు చేసుకుంది. ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు జరిగింది. కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్పు చేసింది పోలీసు నియామక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version