తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. గురుకుల స్కూల్ టైమింగ్స్ మార్చాలని.. డిమాండ్ వినిపిస్తున్నాయి. గురుకుల స్కూల్లో టైమింగ్స్ మార్చాలని విద్యార్థులతో పాటు సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న టైం టేబుల్… ఏమాత్రం సమంజసం కాదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తమపై తీవ్ర ఒత్తిడి పెంచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు అలాగే సిబ్బంది.

గతంలో ఉదయం 9:30 గంటల నుంచి గురుకులాలు ప్రారంభం అయ్యేవి అని గుర్తు చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ కామన్ టైం టేబుల్ శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.