తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. రెండు రోజుల నుంచి స్కూళ్లకు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడేస్ ఉన్న తరుణంలో తిరుమల శ్రీవారి సన్నిధికి వేలాది భక్తులు వస్తున్నారు.

దీంతో తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. సర్వదర్శనాలకు 24 గంటల సమయం పడుతుంది అని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శిలా తోరణం వరకు క్యూలైన్లో భక్తులు వేసి ఉన్నారని చెబుతున్నారు.
నిన్న తిరుమల శ్రీవారిని సుమారు 80, 193 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 33 వేల 298 మంది తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే 4.43 కోట్ల ఆదాయం తిరుమల శ్రీవారి హుండీకి వచ్చింది.