కేసీఆర్ తో టచ్ లోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లినట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ… ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెప్తున్నారని… ఏ ఊరికి వెళ్లిన అక్కడి నేతకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్తారన్నారు. కేసీఆర్ 20మంది టచ్ లో ఉన్నారనే మాటలు చూస్తే ..కేసీఆర్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ లో ఉన్నారేమో అంటూ చురకలు అంటించారు.
నాకు అయితే అదే అనుమానం ఉందని.. సీఎం హామీలను ప్రజలు నమ్మట్లేదని ఎద్దేవా చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. అందుకే దేవుళ్ళ మీద ఓట్లు వేస్తున్నారు…ప్రజలు నమ్మట్లేదని దేవుళ్ళ మీద ఒట్టు వేయడం బాధాకరమన్నారు. రుణమాఫీ ఒకే మిగిలిన హామీల మాటేమిటి? మిగతా హామీల కొరకు ఎంత మంది దేవుళ్ళ మీద ఒట్టు పెడతావు? అంటూ నిలదీశారు. నాలుగున్నర నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి… ఎన్నడు లేని విధంగా రైతులు గోస పడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి.