తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినవేని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన విజయోత్సవ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రైతుల గురించి, వ్యవసాయం గురించి చేసింది ఏమి లేదన్నారు. కృష్ణాజలాల గురించి పట్టించుకోలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించింది. కల్వకుర్తి ఎత్తిపోతల, కోయిల సాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో జారీ చేసింది. పాలమూరు జిల్లాను ఎండబెట్టి ఎడారి చేశారని గుర్తు చేశారు. SLBC ప్రాజెక్టు పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయడం ద్వారా పనులు జరుగుతున్నాయి. SLBC ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రాజెక్టు పట్టించుకోలేదన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఇదే అతి పెద్ద పండుగ అన్నారు. పదేళ్ల పాటు రుణమాఫీ చేస్తానని చెప్పి.. 4 దఫాలుగా చేస్తే.. అవి వడ్డీకే సరిపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2లక్షల లోపు రైతుల రుణాలన్నింటిని మాఫీ చేస్తామని చెప్పాం.. చెప్పినట్టుగానే చేశాం. కొందరికీ మాఫీ కాలేదు. వారికి చేస్తామని తెలిపారు.