డిప్యూటీ సీఎం ప్రశ్నలు కి సీఎం సమాధానం చెప్పాలి : కన్నబాబు

-

డిప్యూటీ సీఎం ను కాకినాడ పోర్ట్ లో ఆయన కంటే పెద్ద పదవి లో ఉన్నవారు ఆపి ఉంటారు అని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. అయితే రాష్ట్రంలో డిప్యూటీ సీఎం కి ఈ పరిస్థితి ఉంటే సామాన్యులు పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ ప్రభుత్వం లో ఏమి జరుగుతోంది. కలెక్టర్ షిప్ లో వెళ్లగలిగారు.. కానీ డిప్యూటీ సీఎం ఎందుకు వెళ్లలేకపోయారు అని అన్నారు. అయితే కాకినాడ బ్రాండ్ ఇమేజ్ కి విఘాతం కలిగించేలా డిప్యూటీ సీఎం కామెంట్స్ ఉన్నాయి అని ఆరోపించారు.

ఇక పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం లో సమన్వయ లోపం ఉందా.. డిప్యూటీ సీఎం ప్రశ్నలు కి సీఎం సమాధానం చెప్పాలి అని పేర్కొన్నారు. పోర్ట్ భద్రత పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అధికారులు మా ఫోన్ లు ఎత్తడం లేదు.. భయ బ్రాంతులుకి గురి అవుతున్నారు అని కన్నబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news