తెలంగాణ పౌరసరఫరాల శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని జేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రూ.వందల కోట్లు బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని బీ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా డిఫాల్ట్ ఉన్న రైస్ మిల్లర్ల పేర్లు మీరు బయటపెట్టగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని సీఎంగా చేసిన ఘనత బీజేపీదని ఏలేటి అన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిలాగా అపాయింట్‌మెంట్ కాలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కొన్నారని గతంలో కాంగ్రెస్ నేతనే చెప్పారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. రూ. వందల కోట్లు బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఫాల్ట్ ఉన్న రైస్ మిల్లర్ల పేర్లు బయటపెట్టగలరా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.