ప‌లు జిల్లాల‌కు అద‌న‌పు క‌లెక్ట‌ర్ల‌ను కేటాయింపు

-

రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌రుస‌గా ఐపీఎస్, ఐఏఎస్, అద‌నపు క‌లెక్ట‌ర్ హోదా, నాన్ కేడ‌ర్ అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం, వేయిటింగ్ లో ఉన్న వారికి పోస్టింగుల‌ను ఇస్తుంది. శుక్ర‌వారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల‌కు అద‌న‌పు క‌లెక్ట‌ర్ల‌ను నియ‌మిస్తు.. ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. జగిత్యాల అద‌న‌పు క‌లెక్ట‌ర్ గా బీఎస్ ల‌త‌, నారాయ‌ణ పేట్ అద‌న‌పు క‌లెక్ట‌ర్ గా జి. ప‌ద్మ‌జారాణి, రాజ‌న్న సిరిసిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ గా ఖీమా నాయ‌క్ కు పోస్టుంగ్ లను రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చింది.

అలాగే వ‌రంగ‌ల్ అద‌న‌పు క‌లెక్ట‌ర్ గా కె . శ్రీ‌వాస్త‌వ‌, ములుగు అద‌న‌పు క‌లెక్ట‌ర్ గా వై వి గ‌ణేష్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అద‌న‌పు క‌లెక్ట‌ర్ గా ఎం డేవిడ్ ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు నాగ‌ర్ క‌ర్నూల్ అద‌న‌పు క‌లెక్ట‌ర్ గా ఉన్న పీ శ్రీ‌నివాస‌రెడ్డిని సిద్దిపేట్ కు బ‌దిలీ చేశారు. అంతే కాకండా.. బ్ర‌హ్మ‌ణ సంక్షేమ ప‌రిష‌త్ పాల‌నాధికారి చంద్ర మోహ‌న్ ను కామారెడ్డి అద‌న‌పు క‌లెక్ట‌ర్ గా బ‌దిలీ చేశారు. అలాగే చంచ‌ల్ గూడ ప్ర‌భుత్వ ముద్ర‌ణాల‌యం పాల‌నాధికారిగా కె అనిల్ కుమార్ తో పాటు హైద‌రాబాద్ జిల్లా భూప‌రిరక్ష‌ణ ఎన్డీసీగా బీ. సంతోషిని ల‌ను ప్ర‌భుత్వం నియ‌మించారు. వీరితో పాటు ప‌లువురు నాన్ కేడ‌ర్ అధికారుల‌ను కూడా బ‌దిలీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news