పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ షో ప్రదర్శన సందర్భంగా డిసెంబర్ 04న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్, తరువాత విడుదలవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు అతనొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా..?
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అల్లు అర్జున్ కుట్ర ఉందా..? లేదా ఆయనకు మధ్యంతర బెయిల్ కి వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్లు కాదా..? ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా..? అని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. కాలం కొన్నింటికి సమాధానం చెబుతుంది. అల్లు అర్జున్ నువ్వు కూడా ఒక్క రోజు జైలులో ఉన్నావ్ కదా..? పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడం ఏంటి..? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మల్లన్న మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.