నేడు విశ్వ యవనికపై భారత్‌ సత్తా చాటుతోంది : అమిత్ షా

-

భారత్​లో వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. క్రిప్టో కరెన్సీతో దేశ ఆర్థికవ్యవస్థ బలహీనానికి యత్నిస్తున్నారని.. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్టంగా పోరాడాలని తెలిపారు. హైదరాబాద్​లో నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన 75వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్​లో అమిత్ షా పాల్గొన్నారు. శిక్షణ పూర్తైన ఐపీఎస్‌లు నేటి సమాజంలో ఏర్పడుతున్న సమస్యలపై పోరాడుతారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంగ్లేయుల కాలం నాటి 3 చట్టాలను మార్చాల్సి ఉంది. సీఆర్‌పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్‌ చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంది. మూడు చట్టాల్లో మార్పులు చేసి ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచింది. త్వరలో నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుంది. చట్టాల్లో మార్పులు చేసి భారత్‌ కొత్త విశ్వాసం, ఆకాంక్షలతో ముందుకెళ్తోంది. శాసనాలను సురక్షితంగా ఉంచడమే పాత చట్టాల ఉద్దేశంగా ఉండేది. ప్రజల అధికారాలను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశం. కొత్త చట్టాల ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలి. అని అమిత్ షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news