అధికారంలోకి రాగానే పేపర్ లీకేజీ నిందితులను జైలుకు పంపుతాం : అమిత్ షా

-

అవినీతి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులను జైలుకు పంపిస్తామని మాటిచ్చారు. బీఆర్ఎస్ సర్కార్‌ స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా ఇవాళ ఆర్మూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఆర్మూరు బీఆర్ఎస్ నాయకులు బస్‌డిపో భూమిని కబ్జా చేశారు. బస్సు డిపో భూమి కబ్జా చేసి షాపింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. షాపింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన నేతకు బీఆర్ఎస్ టికెట్‌ ఎందుకు ఇచ్చింది. బీఆర్ఎస్ టికెట్‌ కోసం కూడా డీలింగ్‌ ఉంటుందని మీకు తెలియట్లేదు. పసుపు రైతుల కోసం కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుంది. ముస్లింలకు 4 శాతం మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం. బోర్డు ద్వారా పసుపు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. పసుపు ఎగుమతులతో పాటు పరిశోధనలు జరుగుతాయి. నిజామాబాద్‌ బీడీ కార్మికుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. ఉత్తర తెలంగాణ నుంచి లక్షలాదిగా గల్ఫ్‌, విదేశాలకు వలస వెళ్తున్నారు. వలస వెళ్లే కార్మికుల కోసం ఎన్‌ఆర్‌ఐ మంత్రిత్వశాఖ కృషి చేస్తుంది. అని అమిత్ షా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version