కుటుంబ అభివృద్ధి భారతదేశ ప్రగతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి : అమిత్ షా

-

కాకతీయ రాణి రుద్రమదేవికి మనస్ఫూర్తిగా ప్రణామం చేసి చెబుతున్నా నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఓట్‌ ఫర్‌ జిహాద్‌, ఓట్‌ ఫర్‌ అభివృద్ధి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని పేర్కొన్నారు. కుటుంబ అభివృద్ధి – దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్య, రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీ.. మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి వ్యాఖ్యానించారు. భువనగిరిలో పర్యటించిన అమిత్ షా బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు.

“మూడు విడతల ఎన్నికల్లో ఇప్పటికే 200 సీట్లకు పైగా స్థానాలు గెలిచాం. దేశవ్యాప్తంగా మొత్తం 400కు లోక్‌సభ స్థానాలు సాధిస్తాం. తెలంగాణలో గత ఎన్నికల్లో 4 లోక్‌సభసీట్లు గెలిచాం. తెలంగాణలో మొత్తం 10కి పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తాం. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ స్కోర్‌.. దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా తయారైంది. కాంగ్రెస్‌ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకట్లేదు.” అని అమిత్ షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version