తెలంగాణపై బీజేపీ ఫోకస్..కీలక నేతలతో అమిత్ షా మంతనాలు

-

తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ బిజెపి నేతలు అంతా ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు హస్తినకు పయనం అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, డికె అరుణ, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సహా ముఖ్య నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయా నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ భేటీ కానున్నారు.

త్వరలో ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన బిజెపి అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా, ‘ప్రజాగోస-బీజేపీ భరోసా’ పేరిట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లకు పిలుపునిచ్చింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లకు ఇవాళ చివరి రోజు కాగా, ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ లతోపాటు బహిరంగ సభలో నిర్వహించాల్సి ఉంది. ఆ సభల్లో పార్టీ ముఖ్య నేతలు అంతా పాల్గొంటారని తెలంగాణ బిజెపి ఇంతకుముందే ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news