ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది…విద్యార్థికి గుండు కొట్టించాడు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం బయటపడింది. ఫస్టియర్ విద్యార్థికి గుండు చేయించారు అసిస్టెంట్ ప్రొఫెసర్. విద్యార్థి జుట్టు సరిగా కట్ చేయించుకోలేదని గుండు చేయించారు ప్రొఫెసర్. క్రమశిక్షణ పేరుతో ఈ చర్య చేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్.

కానీ ఈ అంశం వివాదంగా మారి చెలరేగింది. దీం తో ర్యాగింగ్ కమిటీ నిర్వాహన బాధ్యతల నుంచి ఆ ప్రొఫెసర్ ను మెడికల్ కళాశాల ఉన్నతాధికారులు తప్పించడం జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. ఇక ర్యాగింగ్ కమిటీ నిర్వా హన బాధ్యతల నుంచి ఆ ప్రొఫెసర్ ను మెడికల్ కళాశాల ఉన్నతాధికారులు తప్పించడంతో… విద్యార్థి కుటుంబం కూడా కాస్త కూల్ అయింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.