జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీ కే రూపకల్పన బాధ్యతలు ఇచ్చామని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ పాటను ఎం.ఎం.కీరవాణితో రూపకల్పన చేయించిన విషయం తెలిసిందే. జూన్ 02న రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఈ పాటను ఆవిష్కరించనున్నారు.
తాజాగా ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్ తో మీడియాతో మాట్లాడారు. జయ జయహే తెలంగాణ పాటను అందెశ్రీ యే కీరవాణిని ఎంపిక చేశారని తెలిపారు. సంగీత దర్శకుడి ఎంపికలో నా పాత్ర లేదు అని తెలిపారు. రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది. అధికారిక చిహ్నం లో కాకతీయ తోరణం ఉండదు అని తెలిపారు. సమ్మక్క, సారక్క – నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నము అన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం రూపొందించినట్టు తెలిపారు.