కాంగ్రెస్ కు హరీష్ రావు..లీగల్ నోటీసు ఇష్యూ !

-

కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. రాజ్య సభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసు పంపారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆనంద కన్వెన్షన్ లో హరీష్ రావుకు వాటా ఉందని ఆరోపించిన రాజ్య సభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసు పంపారు.

Harish Rao warned that he will give legal notice to Congress MP Anil

తన అడ్వకేట్ అక్కి భాస్కర్ గౌడ్ ద్వారా అనిల్ యాదవ్‌కు లీగల్ నోటీసు పంపారు హరీష్ రావు. అంతకు ముందు మాజీ మంత్రి హరీశ్ రావుకు ఆనంద్ కన్వెన్షన్‌లో వాటాలున్నాయని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్ భూముల్లో అక్రమంగా ఆనంద్ కన్వెన్షన్‌ని నిర్మించారని పేర్కొన్నారు. అందులో మాజీ మంత్రి హరీశ్‌కు కూడా వాటాలున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే పేద ప్రజలను హరీశ్ అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపైకి రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version