హైదరాబాద్‌లోని పలు విద్యాసంస్థలపై ఈ మధ్యకాలంలో వరుసగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా నిర్వాహకుల్లో మాత్రం చలనం రావడంలేదు. విద్యార్థులు సమస్యల వలయంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, భోజనం వసతి విషయంలో సరైన మెయింటెన్స్ లేకపోవడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
విద్యార్థినులకు సంబంధించిన సమస్యలపై మీడియాలో వరుస కథనాలు రావడంతో సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్..దీంతో శ్రీచైతన్య కాలేజీలో ఆమె తనిఖీలు నిర్వహించారు. పరిశీలన అనంతరం అక్కడి దారుణమైన పరిస్థితులు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ ప్రాంగణంలోనూ విద్యార్థినుల హాస్టళ్లు, మెస్‌లను తనిఖీ చేశారు. నాసిరకమైన ఫుడ్, హాస్టల్ సౌకర్యాలు సరిగా లేవని గుర్తించి కాలేజీకి నోటీసులు జారీ చేశారు.