హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని రెహమత్ నగర్ లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి వచ్చిందని భర్త అతికిరాతకంగా దాడి చేశారు. ఆ దాడిలో భాగంగా తన భార్య మరణించింది. నరసింహ అనే వ్యక్తి తన మొదటి భార్య వదిలివేయడంతో గత ఏడు సంవత్సరాల క్రితం సోని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

అయితే సోనీ తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లిందని తనపై చితకబాదాడు. ఆ దాడిలో సోనీ తీవ్ర గాయాల పాలైంది. వెంటనే స్థానికులు సోనిని చూసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో నరసింహాని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.