మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందజేసింది. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అవసరమైన చీరలను సిరిసిల్లలో పవర్ లూమ్ మీద తయారు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది మహిళలకు రెండు చీరల చొప్పున 1.30 కోట్ల చీరలు అవసరం ఉన్నాయి. ఇదిలా ఉండగా… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కో మహిళకు ఒక్కో చీరను ఇచ్చారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు రెండు చీరలు చొప్పున ఇవ్వడంతో తెలంగాణలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.