హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారు జాము నుంచే పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించిన విషయం తెలిసిందే. అయితే, తన ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
ఆయన వెళ్లేసరికి ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కౌశిక్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన అనుచరులతో కలిసి స్టేషన్‌లో నానా హంగామా చేశారు. తమ విధులకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసులు కౌశిక్‌రెడ్డి, అనుచరులపై కేసు నమోదు చేశారు. దీంతో నేడు కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారనే సమాచారం మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు అక్కడికి వెళ్ళారు. కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకున్న హరీశ్‌రావు, బీఆర్ఎస్ కార్యకర్తలను సైతం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.