సౌర విద్యుత్ ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పారు.
సౌర విద్యుత్‌తో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంతో పాటు ఆలోచన జ్ఞానాన్ని కూడా కాల్పోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో గతేడాది వర్షాలు తక్కువగా పడటం వల్లే నీటి కొరత ఏర్పడిందన్నారు. తెలంగాణలో వర్షాపాతం ఎక్కువ నమోదు అయినా హైదరాబాద్ కు నీటిసరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని బీఆర్ఎస్ నేతలు విర్శలపై కౌంటర్ వేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ఆర్కే సింగ్ తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.