Another fraud exposed in Tirumala shrine: తిరుమల పుణ్యక్షేత్రంలో బయటపడిన మరో మోసం బయటపడింది. సుప్రభాత సేవ, వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు, వీఐపీ గెస్ట్ హౌస్‌లో గదులు ఇప్పిస్తామంటూ భక్తులకు శఠగోపం పెట్టారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ వింగ్ అధికారులను హైదరాబాద్‌కి చెందిన భక్తుడు వేంకటేశ్వర్లు ఆశ్రయించారు.
విజిలెన్స్ విచారణలో తిరుపతికి చెందిన పాత నేరస్థురాలు కె.నవ్యశ్రీగా గుర్తించారు అధికారులు. మొత్తం రూ.41 వేలు భక్తులు నుంచి తీసుకుని ఉడాయించిన మహిళ..తమిళనాడు వెళ్లినట్లు సమాచారం.