సింగరేణి కార్మికులకు అదిరిపోయే శుభవార్త..!

సింగరేణి కార్మికులకు అదిరిపోయే శుభవార్త అందింది. సింగరేణి కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించి 23 నెలల ఏరియన్స్ ను ఈనెల 21న చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. మొత్తం 42,000 మందికి రూ. 1726 కోట్ల బకాయిలను విడుదల చేయనుంది. 12% సీఎంపీఎఫ్, మరో ఏడు శాతం పెన్షన్, 30% ఇన్కమ్ టాక్స్ చెల్లింపులు పోను రూ. 900 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాలో జమ కానున్నాయి.

ఇక అటు అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్దం చేసుకొని ఇప్పుడు దశాబ్దిలో ఫలితాలు చూస్తున్నామని తెలిపారు. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో అద్భుత ఫలితాలు చూస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్- 2022 దక్కిందని కేసీఆర్ గుర్తు చేశారు.