తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

-

ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాలకు ఎన్ఐఎన్ సహాకారం అందించనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్షీయల్ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆహార భద్రతతో పాటు నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు హైదరాబాద్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారం తీసుకుంటోంది.

TG Govt
TG Govt

తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 268 రెసిడెన్షీయల్ విద్యాసంస్థలున్నాయి. వీటిలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రతీరోజు భోజనంతో పాటు స్నాక్స్ ను అందించే కామన్ డైట్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో పలు చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు.. కొన్ని చోట్ల ఆహార నాణ్యత లోపించిందని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఆహార నాణ్యతతో ప్రమాణాలతో పాటు సిబ్బంది పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ రూపొందించేందుకు ప్రభుత్వం ఎన్ఐఎన్ సహకారం కోరింది. వీటితో పాటు సిబ్బందికి తగిన శిక్షణ మాడ్యూల్ ను అభివృద్ధి చేయాలని కోరింది. 

Read more RELATED
Recommended to you

Latest news