మలక్ పేట్ శిరీష హత్య కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధాల గుట్టు తెలిసిన శిరీష బతికుంటే ఎప్పటికైనా బయటపెట్టే అవకాశం ఉందని భావించింది ఆడపడుచు సరితా. అనాథ అయిన శిరీష కు సరిత ఎప్పటి నుంచో స్నేహం, కలిసి పనిచేసేవారు. తన తమ్ముడు వినయ్ కి శిరీషతో పెళ్లి చేసింది సరిత. శిరీష ఇటీవలే మళ్లీ ఉద్యోగం మారడం తో గొడవ మొదలయింది.

గొడవలో నీ అక్రమ సంబంధాలు తెలుసు అని శిరీష నోరు జారిందట. ఎప్పటికైనా శిరీష తన అక్రమ సంబంధాల గురించి బయటపెట్టే అవకాశం ఉందని భావించి..హెవీగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది సరిత. ఆ తరవాత గొంతు నులిమి చంపింది సరిత. శిరీషను తానే చంపానని ఒప్పుకుంది సరిత. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే శిరీష భర్త వినయ్ కుమార్, అక్క సరిత, మరో అక్క కొడుకు నిహాల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.