జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసు.. మరో ఎస్సై సస్పెన్షన్‌

-

పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రాహిల్ కేసుల్లో అతణ్ని తప్పించిన కారణంగా అధికారులపై వేటు పడుతోంది. రాష్ట్రంలో రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్‌ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్‌-1 ఐజీ సస్పెండ్‌ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది.

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు రాహిల్‌ను రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో హైదరాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌రూం ఎస్సై చంద్రశేఖర్‌ను కమిషనర్‌ శ్రీనివాస రెడ్డి సస్పెండ్‌ చేసి.. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సుదర్శన్‌, చీఫ్‌ ఆఫీస్‌ ఐటీ సెల్‌ డీఎస్పీ రాజశేఖర్‌రెడ్డిపై డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు.

2022 మార్చి 17న జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలోని రోడ్‌ నంబర్‌ 45 ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ ఉన్నా.. అతడిని తప్పించేలా దర్యాప్తును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news