సీఎం సార్ న్యాయం చేయండి.. వృద్ధురాలు సెల్ఫీ వీడియో

-

సీఎం సార్ న్యాయం చేయండి అంటూ ఓ వృద్ధురాలు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. వైసీపీ నేతల నుంచి తమను రక్షించాలని కోరుతూ ఓ మహిళ వేడుకుంది. తిరుపతి శ్రీనివాస నగర్‌కు చెందిన శ్రీదేవి అనే వృద్ధ మహిళ సెల్ఫీ వీడియో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

తన ఇంటిని భూమన అభినయ్ రెడ్డి స్నేహితుడు కృష్ణ చైతన్య యాదవ్ బలవంతంగా రాయించుకున్నాడంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆపై మురళీ రెడ్డికి విక్రయించారని సదరు బాధితులు వాపోయింది. 2021 నుంచి తాను పోరాటం చేస్తున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది. మురళీ రెడ్డి, కృష్ణ చైతన్య తన ఇంటి మీదికు గుండాలతో వచ్చి దాడి చేశారని అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news