బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి టికెట్ ఆశించారు, అయితే భారతీయ జనతా పార్టీ నుండి నిరాశ మిగిలింది.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి జితేందర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం రేవంత్, ఇంచార్జీ మున్షీ సమక్షంలో జితేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కాంగ్రెస్ లో చేరారు.ఈ తరుణంలోనే ఢిల్లీలో ఏ.పీ. జితేందర్ రెడ్డికి కీలక పోస్ట్ దక్కింది.దక్కింది. ఏ.పీ. జితేందర్ రెడ్డిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.