కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్యకేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అనిల్ హత్యలో కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అనిల్‌కి ఆ ఎమ్మెల్యే మనవడితో ఆర్థిక సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో అనిల్ రూ. కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం అందుతోంది.

డబ్బులు ఇవ్వకపోవడంతో డప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి నుంచి బెంజ్ కారు అనిల్.. లాక్కున్నట్లు సమాచారం అందుతోంది. మొన్న గాంధీభవన్‌లో సమావేశానికి హాజరై ఓ రియల్ఎస్టేట్ ఆఫీసుకు వెళ్లి గొడవపడ్డాడు అనిల్. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అనిల్‌ను రెండు కార్లలో వెంబడించి హతమార్చారు నిందితులు. అటు అనిల్ డెడ్ బాడీలో నాలుగు బులెట్ లను గుర్తించారు వైద్యులు. హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణుల బృందం వచ్చిన తర్వాతే పోస్టుమార్టం ప్రక్రియ జరుగనుంది.