బెంగళూరులో మూడబిదిరెలోని ఓ ప్రముఖ కళాశాలలో దారుణం జరిగింది. ఓ విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్, వారి స్నేహితుడు అనూప్ కలిసి పలుమార్లు లైంగికదాడి చేశారు. బాధిత విద్యార్థినితో చనువు పెంచుకుని.. నోట్స్ ఇస్తానని చెప్పి విద్యార్థినిని మారతహళ్లిలోని అనూప్ నివాసానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఉన్న ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర.

అనంతరం నరేంద్రతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని బెదిరించి.. బయాలజీ లెక్చరర్ సందీప్, అనూప్ సైతం విద్యార్థినిపై అఘాయిత్యం చేశారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో మారతహళ్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితులు గతంలోనూ ఇతర విద్యార్థినులతో ఇదే విధంగా లైంగిక వేధింపులకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.